ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ

కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్

బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త):

ఆడబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ద్వారా అనునిత్యం ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ బీర్కూర్ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో గ్రామానికి చెందిన మేత్రి హన్మవ్వ, రాచకొండ లక్ష్మి, కోటగిరి నాగవ్వలకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాల సమయంలో ఈ పథకాలు ఎంతో ఉపయుక్తంగా మారాయని అన్నారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ల ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని లబ్ధి పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, నాయకులు కాదేపురం గంగన్న, కుమ్మరి గంగారాం, మేత్రి నాగు గొండ, కోరె హావగిర్ రావు, చైనాపురం వీరప్ప, బోయి లాలయ్య, వడ్ల నాగయ్య, హట్కరి దశరథ్, చాకలి సురేష్, హొక్నారి అశోక్, ఇందూర్ గజేందర్, క్యాదని లింగప్ప, కోటగిరి సాయిలు, బోయి చిన్న సాయిలు, నల్లి భాగయ్య, వడ్ల నారాయణ, నల్లి గంగారాం, మనప్ప గారి నాగప్ప, గైని రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 21
Tags:

About The Author

Related Posts

Latest News

ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త): లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం