వెంకన్న కొండను దర్శించుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

బాన్సువాడ, డిసెంబర్ 31:

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  బుధవారం భక్తులతో కలిసిబాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ శివారులోగల ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెంకన్న కొండను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుభిక్షం, సంక్షేమం కోసం దేవునికి ప్రార్థనలు చేశారు.దర్శనానంతరం ఆలయ అర్చకులు మల్లికార్జున్‌కు ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అంకితభావంతో పని చేస్తుందని, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రేస్ పార్టీ బీర్కూర్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్,బస్వారాజ్ పటేల్,ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు,మాజీ ఎంపీపీ రఘు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లికార్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Views: 38
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు