లేబర్ కోడ్లు, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి

కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ నిరసన

కామారెడ్డి, నవంబర్ 26(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు  ఆధ్వర్యంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అలాగే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది . ఈ సందర్భంగా చంద్రశేఖర్  మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ల కిందికి తీసుకొచ్చి దేశంలో ఉన్న కార్మిక రంగాన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటందుకు ప్రయత్నిస్తుందని ఈ కోడ్లు కార్మిక వర్గానికి సమ్మెకు కనీస వేతన చట్టం మరియు పనిగంటలు గ్రాటివిటీ ఈపీఎఫ్ పీఎఫ్ వంటి హక్కులను రాకుండా నిర్వీర్యం చేస్తుందని కోడ్ (2019) పారిశ్రామిక సంబంధాల మరియు(2020)కోడ్ సామాజిక భద్రత( 2020 )కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ (2020) లు 2020లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల అమల్లోకి వస్తున్నాయని కేంద్రం ప్రకటించడాన్ని అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా  కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలొ  సిఐటియు నాయకులు ముధం అరుణ్ కుమార్ రైతు సంఘం నాయకులు మోహన్ పటేల్ దశరథ్ స్వామి శీను కృష్ణంరాజు గంగారాం సాగర్ ఈశ్వర్ సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు