ఇల్లు కాలిన బాధితునికి ఆర్థిక సహాయం అందించిన బీర్కూర్ మండల నాయకులు
On
బీర్కూర్, మార్చి 18 (డిడి9 వార్త):
బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మచ్కురి కిష్టయ్య నివాస గృహం ఇటీవల అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలిసిన బీర్కూర్ మండల నాయకుడు మియ్యాపురం శశికాంత్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000ల ఆర్థిక సహాయం అందించారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారం శ్రీనివాస్ రూ.5,000లు, ప్రతాప్ రెడ్డి రూ.2,000లు అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మొత్తంగా రూ.12,000ల ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి అందించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 40
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

