నల్లా నీటిలో జలగలు…

చూసీచూడనట్టు ప్రజాప్రతినిధులు… కాలనీవాసులకు మురికి నీరే శరణ్యమా? మాగోషా వినేవారేలేరా?

బీర్కూర్,ఫిబ్రవరి 01(డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలోని 6వ, 8వ వార్డులలో పారిశుధ్య సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నల్లనీళ్లలో జలగలు వస్తున్నాయి, మురికి నీటిలో జలగలు పెరుగుతున్నాయి. కాలనీవాసులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే మురికి నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.డ్రైనేజీ ప్రక్కనే నల్లనీళ్లు ప్రవహిస్తూ, దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగిపోతోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు అంటున్నారు.వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టి నల్లనీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీవాసుల మాగోషను వినాలని వారు కోరుతున్నారు.

Views: 30
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు