చిన్నారుల సౌకర్యానికి లయన్స్ క్లబ్ సేవ: బరంగేడ్గి అంగన్వాడీలకు ఫ్యాన్ల విరాళం
On
బీర్కూర్,ఫిబ్రవరి 04(డిడి9 వార్త): బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలోని అంగన్వాడీ రెండు కేంద్రాలకు రూ.2,500 విలువ చేసే రెండు ఫ్యాన్లను లయన్స్ సభ్యుడు కార్తీక్ పటేల్ అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విరాళాలు అందించినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, లయన్స్ సభ్యులు కార్తీక్ పటేల్, మేకల కార్తీక్, అబ్దుల్ నయీం పాల్గొన్నారు.అలాగే అంగన్వాడీ టీచర్ అమృత, ఆయమ్మ గిర్మవ్వ, లాలయ్య, సాయిలు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
Views: 41
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

