గణతంత్ర దినోత్సవం సందర్భంగా కిష్టపూర్ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం
బీర్కూర్,జనవరి 26(డిడి9 వార్త): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీర్కూర్ మండలం కిష్టపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయుడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.7,000 విలువ చేసే 160 స్టీల్ గ్లాసులను సీనియర్ లయన్స్ సభ్యులు ఎం.ఏ. రషీద్ గారు దాతగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమానికి కిష్టపూర్ ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ లత, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలె రమేష్, ట్రెజరర్ మేకల గాలయ్య, జోన్ చైర్మన్ కొట్టురి సంతోష్, సీనియర్ లయన్స్ సభ్యులు కిషోర్ దాస్, లయన్స్ సభ్యులు వాంకర్ కార్తీక్ పటేల్, ఉపాధ్య బృందం, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి, విద్యార్థుల శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతున్నాయని పలువురు ప్రశంసించారు.

