నిరుపేదలకు అండగా యువ నాయకుడు మియాపురం శశికాంత్
బీర్కూర్,జనవరి 08(డిడి9 వార్త):
నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న యువ నాయకుడు మియాపురం శశికాంత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.బీర్కూర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన సయ్యద్ హుస్సేన్ ఇటీవల తన కూతురు వివాహాన్ని నిర్వహించారు. అయితే వివాహానికి కావలసిన ఖర్చుల కారణంగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం శశికాంత్ దృష్టికి వచ్చింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందించిన శశికాంత్ తన వ్యక్తిగత వంతుగా రూ. 6,100/- నగదు సహాయాన్ని అందజేసి, ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు.ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ "సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలి. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ" అని అన్నారు.శశికాంత్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు, గ్రామస్తులు అభినందిస్తూ, యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

