బాన్సువాడలో నూతన ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం
On
బాన్సువాడ, నవంబర్ 26(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలో రూ. 37.50 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న 100 పడకల నూతన ఏరియా ఆసుపత్రి పనులను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణం నాణ్యతాహీనంగా ఉండకూడదని, తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఎజాస్, యండి దావూద్, బాబా, నర్సగొండ తదితరులు పాల్గొన్నారు.
Views: 68
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

