చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, జూలై 30(డీడీ9 వార్త): బీర్కూర్ శివారులో మంజీరా నదిపై ఇటీవల నిర్మాణం పూర్తయిన చెక్‌డ్యామ్‌లో భారీ వర్షాల కారణంగా సమృద్ధిగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. చెక్‌డ్యామ్ నిండుకుండలా పొంగిపొర్లుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం చెక్‌డ్యామ్‌ను సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి చెక్‌డ్యామ్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు సమర్పించి ప్రార్థనలు చేశారు.రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఎమ్మెల్యే పోచారం ఆకాంక్షించారు.చIMG-20260730-WA0032క్‌డ్యామ్ నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే భారీగా నీరు చేరి పొంగిపొర్లుతుండటంతో రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ చెక్‌డ్యామ్ వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలకు కూడా దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు చెక్‌డ్యామ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని, ఇటువంటి నిర్మాణాలు వ్యవసాయాభివృద్ధికి, భూగర్భ జలాల పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. చెక్‌డ్యామ్‌లో నీరు ఉప్పొంగుతూ ఉండటంతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారగా, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జలకళను తిలకించారు.అయన వెంట యువజన నాయకులు మియాపురం శశికాంత్, మాజీ ఎంపీపీ రఘు, కొరిమె రఘు, దుంపల రాజు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఉన్నారు.

Views: 165
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు