బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, మార్చి 01(డిడి9 వార్త):

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన మొత్తం 178 మంది లబ్ధిదారులకు రూ.1,78,20,648/- విలువైన చెక్కులు అందజేశారు.మండలాల వారీగా చూస్తే బాన్సువాడ గ్రామీణ మండలానికి చెందిన 54 మందికి రూ.54,06,264/-, బాన్సువాడ పట్టణానికి చెందిన 30 మందికి రూ.30,03,480/-, నసురుల్లాబాద్ మండలానికి చెందిన 74 మందికి రూ.74,08,584/-, బీర్కూర్ మండలానికి చెందిన 20 మందికి రూ.20,02,320/- చొప్పున సహాయం అందింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల వివాహాల కోసం ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 55
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు