పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం

పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.. తహసీల్దార్‌కు వినతి

విద్యార్థుల భవిష్యత్తు కోసం మూడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో పనిచేసిన ఒకేషనల్ ఉపాధ్యాయురాలు మద్దినేని పార్వతి రమేష్ శనివారం పదవీ విరమణ పొందారు. కోటగిరి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆమె విడ్కోలు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం: పార్వతి ఇదే పాఠశాలలో సుమారు 33 ఏళ్ల పాటు ఒకేషనల్ ఉపాధ్యాయురాలిగా సేవలందించి, వందలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఒకే పాఠశాలలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ చేయడం విశేషం. కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు తాటి వీరేశం తరఫున సొసైటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పార్వతి గారి సేవలు చిరస్మరణీయమని, ఆమె విశ్రాంత జీవనం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, పోల విటల్ సెట్, రాజేశ్వర్ పటేల్, మాజీ ఎంఆర్ఓ సాయిలు, టెలిఫోన్ గంగారం, సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్ గంగాధర్ మరియు కిడ్స్ సొసైటీ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు