సుంకినిలో మన ఇసుక వాహనం ప్రారంభం : తహసీల్దార్ గంగాధర్

సుంకినిలో మన ఇసుక వాహనం ప్రారంభం : తహసీల్దార్ గంగాధర్

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామంలోని మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో మన ఇసుక వాహనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాధర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు వినియోగదారులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇసుక అవసరమున్న మన ఇసుక వాహనం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాసి పటేల్, ఏఎంసి చైర్మన్ హనుమంతు, గ్రామ సెక్రటరీ, సర్వేయర్లు, జీపీ సిబ్బంది, ట్రాక్టర్ యజమానులు, వర్ని కార్తిక చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు