లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్

సాలూరలో ఘనంగా ప్రజ్ఞశ్రీ పాఠశాల 26వ వార్షికోత్సవం

లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా, సమాజంపై అవగాహన పెంచుకుని ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేయాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్ 26వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత కలిగి ఉండాలన్నారు. పదో తరగతి అనేది జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ప్రతి విద్యార్థి సబ్జెక్టులపై పట్టు సాధించి, వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. కేవలం మార్కులే కాకుండా, నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయని వివరించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఆయన హితవు పలికారు. 18 ఏళ్ల వయస్సు నిండకుండా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. రహదారి నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పుకోవచ్చని విద్యార్థులకు వివరించారు.
క్రమశిక్షణతో కూడిన విద్యే మా బలం
పాఠశాల కరస్పాండెంట్ లత రాజు మాట్లాడుతూ.. గడిచిన 26 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడంలో ప్రజ్ఞశ్రీ ఎప్పుడూ ముందుంటుందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
హోరెత్తిన ప్రాంగణం.. విద్యార్థుల సందడి
వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు, తాజా సినిమా పాటలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు చూసి అతిథులు, తల్లిదండ్రులు మంత్రముగ్ధులయ్యారు. ఈ వేడుకలో బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ, రోడ్డు రవాణా అధికారి శ్రీనివాస్, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ, ఉపాధ్యా సంఘం ప్రతినిది ఇల్తెపు శంకర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
Views: 181
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు