భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

భీమ్‌గల్ పురపాలక కార్యాలయంలో శనివారం 28 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్‌పర్సన్  బోదిరే నాగమణి స్వామి, కౌన్సిలర్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అందించే కల్యాణ లక్ష్మి చెక్కులు అత్యంత వేగంగా మంజూరవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ సంటి లత నరయ్య, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్లు సందీప్, తోట సతీష్, అంజుమ్, సంగ్య నాయక్, పర్స కుశలత అనంతరావు, నీలం రవి, బోదిరే లావణ్య నరయ్యలతో పాటు మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు