సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో శ్రీనిధి, సర్పంచి ధర్మతేజ.
On
బీర్కూర్,జనవరి 29(డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలుశు భారంభమయ్యాయి.ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో శ్రీనిధి మరియు సర్పంచి అరిగే ధర్మ తేజ ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు భావనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో ప్రతిభ కనబరచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్రీడల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Views: 39
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

