నూతన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
On
బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):
బీర్కూర్ మండలానికి నూతనంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ బండి విజయ్‌ను బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని పశువులతో పాటు గ్రామాల్లో సంచరించే గోవులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పశువైద్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పశుసంవర్థక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.డాక్టర్ బండి విజయ్ మాట్లాడుతూ పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, సీనియర్ లయన్ సభ్యులు ఎం.ఏ. రషీద్, మేకల విఠల్, కిషోర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
Views: 46
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

