అంగన్వాడి చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు - చిన్నారులతో కలసి కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
On
కామారెడ్డి,జనవరి 02(డిడి9 వార్త):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో మమేకమై వారి ఆనందోత్సాహాలను పంచుకున్నారు.అనంతరం అంగన్వాడి కేంద్రంలోని రిజిస్టర్లు, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సంబంధిత ICDS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 24
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

