ప్రభుత్వ బాల సదనంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించుకునే అవకాశం
On
కామారెడ్డి,జనవరి 02(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా ప్రజలకు కామారెడ్డి పట్టణ కేంద్రంలో గల హరిజనవాడ, ముదంగల్లీలోని ప్రభుత్వ బాల సదనం, కామారెడ్డి రక్షణ మరియు సంరక్షణ అవసరమున్న బాలికల కోసం లో, ప్రజలు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అలాగే ముఖ్యమైన పండుగలను చిన్నారులతో కలిసి ఆనందంగా జరుపుకునే సదావకాశం కలదు.ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏ. ప్రమీల తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలికలకు మరింత ఆనందం కలుగుతుందని, సమాజంలో సేవాభావం పెంపొందుతుందని ఆమె పేర్కొన్నారు.ఈ విషయమై పూర్తి వివరములకు సూపరింటెండెంట్, ప్రభుత్వ బాల సదనం, కామారెడ్డి కే. సంగామేశ్వరిని 99592 83797 నంబర్‌లో సంప్రదించగలరని ఆమె తెలియజేశారు.
Views: 17
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

