బోనమెత్తిన పద్మశాలి ఆడపడుచులు.. పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ

బాన్సువాడ, జూలై 28(డిడి9 వార్త):

బోనాల పండుగను పురస్కరించుకుని బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో మంగళవారం పద్మశాలి సంఘానికి చెందిన ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తి గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి సమర్పించారు.సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు మంగళవాయిద్యాల నడుమ, భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని భక్తిపూర్వకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం ఇదే విధంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ గ్రామ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు దీకొండ రమేష్,రచ్చ ఆంజనేయులు,గాజుల పండరి, సాయినాథ్, అన్న ఆంజనేయులు, బేతి పోశెట్టి, గాజుల గణేష్, రచ్చ సురేష్, గాజుల సాయిలు, గాజుల శ్రీనివాస్అ, న్నం ముత్తయ్య,అంకం దేవదాస్, అన్నం సాయిబాబా, అన్నం ప్రభు,అన్నం వెంకయ్య, అన్నం రమేష్, మరియుIMG20260728120100 మహిళలు, యువతులు, చిన్నారులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 150
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు