ఘనంగా బీర్కూర్‌లో పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు – జై పీబిఆర్ నినాదాలతో మార్మోగిన బీర్కూర్

IMG-20260723-WA0078బాన్సువాడ, జూలై 23(డిడి9 వార్త):

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీర్కూర్ మండల కేంద్రంలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేసి పూలమాలలు సమర్పించారు.పోచారం భాస్కర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడిగా ఆయన మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షించారు.అనంతరం గాంధీ చౌక్‌లో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు జై పీబిఆర్ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ యూత్ ఐకాన్ మియాపురం శశికాంత్, మాజీ ఎంపీపీ రఘు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాములు, ఉప సర్పంచ్ పరమేష్, డైరెక్టర్ గోండ్ల రాజు, కొరిమె రఘు, ఆత్మ కమిటీ సభ్యుడు శంకర్, విజయ్, ప్రకాష్, దుంపల రాజు, మన్నన్, మేకల విఠల్, ఆరిఫ్, లడిగం గంగాధర్, కిరణ్, ఇంగురాములు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 205
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు