పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజులకు ఆత్మీయ సన్మానం

బాన్సువాడ, జూన్ 06 (డిడి9 వార్త):

బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిను బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, వ్యవసాయ రంగ సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు.అనంతరం బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన సందుల రవిని ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా నియమించిన సందర్భంగా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్లను శాలువాలతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజా సేవలో వారి కృషి, రైతాంగ సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని నాయకులు కొనియాడారు. ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా సందుల రవి నియామకం గ్రామీణ వ్యవసాయాభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవి, నాయకులు కాదేపురం గంగన్న, గాజుల పండరి, ఇందూర్ గజేందర్, హొక్నారి అశోక్, మొండ్కారి కామప్ప, వడ్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Views: 232
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు