బాన్సువాడలో ఘనంగా బోనాల వేడుకలు.. బోనం ఎత్తుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, జూలై 19(డిడి9 వార్త): ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఉన్న శ్రీ జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో ఎమ్మెల్లే పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.పోచారం శ్రీనివాస రెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.అనంతరం నియోజకవర్గ ప్రజలకు ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

