శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
బాన్సువాడ, జనవరి 05(డిడి9 వార్త):
బాన్సువాడ నియోజకవర్గం బోర్లం గ్రామ శివారులోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగింది.ఈ కార్యక్రమాన్ని శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో, బోర్లం వాస్తవ్యులు పర్వా రెడ్డి ఏర్పాటు చేశారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, పోచారం శంభు రెడ్డి,మాజీ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి,
నాయకులు పోచారం సురేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామ నామస్మరణ ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలు బలపడతాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతకు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ గ్రామీణ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే బోర్లం చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని భక్తి భావంతో విజయవంతం చేశారు.

