బరంగ్ ఏడ్గిలో వేగవంతంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

లబ్ధిదారుల ఇండ్లకు భూమిపూజ నిర్వహించిన అధికారులు, నాయకులు

బీర్కూర్, ఏప్రిల్ 09(డిడి9 వార్త):

మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పంచాయతీ కార్యదర్శి గురునాథ్ తెలిపారు. గ్రామంలోని 10వ వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారులు గోండ్ల శాంతవ్వ, గోండ్ల బాలమణి ఇండ్ల నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గురునాథ్ మాట్లాడుతూ పేదలకు స్వంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు, గ్రామ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా పేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించబడుతుందని, లబ్ధిదారులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకునేలా సహకరించాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే పలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని ప్రతి లబ్ధిదారు సద్వినియోగం చేసుకుని తమ కలల ఇంటిని నిర్మించుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బోయి లాలయ్య, అన్న వరలక్ష్మి, గ్రామ నాయకులు కాదేపురం గంగన్న, ఇందూర్ గజేందర్, మొండ్కారి కామప్ప, మేత్రి నాగుగొండ, నీరడి రాములు, క్యాదని లక్షప్ప, శావులం శంకర్, గోండ్ల పెద్ద భూమయ్య, చిన్న భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 41
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు