సర్పంచ్ ఆధ్వర్యంలో రహదారిపై మట్టి తొలగింపు – వాహనదారులకు ఊరట

బాన్సువాడ,జనవరి 25(డిడి9 వార్త): 

బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం బీర్కూర్–బాన్సువాడ ప్రధాన రహదారిపై పేరుకుపోయిన మట్టిని సర్పంచ్ ధర్మతేజ ఆధ్వర్యంలో తొలగించారు. ఇటీవల వరి నాట్ల సీజన్ ప్రారంభం కావడంతో కేజీ వీల్ ట్రాక్టర్లు అధికంగా రహదారిపైకి రావడంతో రోడ్లపై మట్టి పేరుకుపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.గ్రామ పరిశుభ్రతను లక్ష్యంగా పెట్టుకొని గ్రామంలోని రహదారులపై చెత్త, చెదారం తొలగించే కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలో బీర్కూర్–బాన్సువాడ రహదారిపై పేరుకుపోయిన మట్టిని పూర్తిగా తొలగించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మతేజతో పాటు ఈవో గంగారం, పంచాయతీ సిబ్బంది ప్రవీణ్,నాయకులు కొర్రి కృష్ణ, శివకుమార్ యాదవ్, సాయికుమార్, చామకూర రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 67
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు