అకాల మరణంతో విషాదంలో మునిగిన కుటుంబానికి సర్పంచ్–ఎస్సై అండ రూ.10 వేల ఆర్థిక సాయం
బీర్కూర్, జనవరి 31(డిడి9 వార్త):
బీర్కూర్ మండల కేంద్రంలో అనారోగ్యంతో మూడవ తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థిని అకాలంగా మృతి చెందడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది. ఈ హృదయ విదారక ఘటన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచి అరిగే ధర్మతేజ, స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ మానవతా భావంతో ముందుకొచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివసించే చిన్నారి శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచి ధర్మతేజ రూ.5,000, సబ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో గ్రామం మొత్తం మీ వెంట ఉందని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు మానవత్వంతో స్పందించడం గ్రామంలో భావోద్వేగాన్ని కలిగించింది.ఈ కార్యక్రమంలో రామసాని భూమయ్య, మెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.

