సర్వపూర్ దీండి 10వ రోజు పండరిపూర్ పాదయాత్ర ఘనంగా నిర్వహణ
On
బాన్సువాడ, జనవరి 24(డిడి9 వార్త):
బాలరాజ్ మహారాజ్ ఆధ్వర్యంలో గత 13
సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న సర్వపూర్ దీండి–పండరిపూర్ పాదయాత్ర భక్తిశ్రద్ధలతో ముందుకు సాగుతోంది. ఈ పాదయాత్ర 10వ రోజుకు చేరుకోగా, విఠలుని నామస్మరణ, భజనలు, కీర్తనల మధ్య భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఈ పాదయాత్రలో సంగోజిపేట్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, సంజువ్ రావు, అంజ గౌడ్, ప్రశాంత్, ఇప్పల అంజయ్యతో పాటు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. మార్గమధ్యంలో గ్రామ ప్రజలు భక్తులకు ఆతిథ్యం అందిస్తూ, సహకారం అందించడంతో పాదయాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతోంది.ఈ పాదయాత్ర భక్తి భావాన్ని పెంపొందిస్తూ, సమాజంలో ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని భక్తులు పేర్కొన్నారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

