బీర్కూర్ తహసీల్దార్‌గా సవాయి సింగ్
On
బీర్కూర్,జనవరి 07(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల తహసీల్దార్‌గా సవాయి సింగ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు బీర్కూర్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి భుజంగరావును నిజాంసాగర్‌కు బదిలీ చేయగా, అతని స్థానంలో ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సవాయి సింగ్‌ను బీర్కూర్ తహసీల్దార్‌గా నియమించారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సవాయి సింగ్ మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
Views: 540
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

