బరంగేడ్గిలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

బీర్కూర్, ఫిబ్రవరి 19(డిడి9 వార్త):

బరంగేడ్గి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువత, ప్రజలు కలిసి శివాజీ ధ్వజస్థంభం వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వీరత్వం, పరిపాలనా ప్రతిభను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశ చరిత్రలో గొప్ప యోధుడిగా నిలిచారని పేర్కొన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న శివాజీ జయంతిని జరుపుకుంటారు.1630లో జన్మించిన శివాజీ మహారాజ్ ధైర్యం, నాయకత్వం, స్వరాజ్య భావనతో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు.వేడుకలలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 128
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు