వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయలక్ష్మీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు
బాన్సువాడ, డిసెంబర్ 30(డిడి9 వార్త): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎర్రగడ్డ (ఎస్.ఆర్.నగర్) లోని శ్రీ విజయలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, పుష్ప దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించగా, స్వామివారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే దంపతులు రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పవిత్ర దినం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసమృద్ధులు తీసుకురావాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

