చందూర్ మైనారిటీ గురుకుల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య – సిబ్బందిపై సస్పెన్షన్
On
బాన్సువాడ, నవంబర్ 25(డిడి9 వార్త): చందూర్ మండలం కేంద్రంలోని మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల హాస్టల్‌లో 14 ఏళ్ల విద్యార్థి గౌస్ ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన హాస్టల్‌లో విద్యార్థులు, సిబ్బంది ఉన్నప్పటికీ గౌస్ తీవ్ర నిర్ణయం తీసుకున్నందున పెద్ద చర్చనీయాంశంగా మారింది.వీటికి సంబంధించి జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిణి కృష్ణవేణి మంగళవారం ప్రిన్సిపాల్ అనిల్, రాత్రి విధుల్లో ఉన్న టీచింగ్ సిబ్బంది మరియు సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.విద్యార్థి ఇంటి నుంచి హాస్టల్‌లో చేరిన మరుసటి రోజునే ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రిన్సిపాల్ ప్రాధమిక గుర్తింపులో నిర్లక్ష్యం చూపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి సమగ్ర విచారణను అధికారులు చేపట్టారు.
Views: 21
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

