దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ దాడి – ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు

దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ దాడి – ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు

దంతేవాడలో మావోయిస్టుల ఐఈడీ దాడి – ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు

చర్ల, సెప్టెంబర్ 11 (డిడి9): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఉగ్రవాదం మరోసారి తలెత్తింది. దంతేవాడ జిల్లా బర్సూర్ ప్రాంతంలోని సత్ధర్–మాలేవాహి మధ్య సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు దాడికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని సహచర సిబ్బంది హుటాహుటిన దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో అదనపు దళాలను మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికల కోసం కంబింగ్ ఆపరేషన్లను వేగవంతం చేశాయి.
దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ, నిందితులను పట్టుకునే వరకు ఆపరేషన్లు కొనసాగుతాయని తెలిపారు.

Views: 47

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు