మేనఅల్లుడు చేతిలో మేనత్త హత్య – వెంకటాపురం మండలం కలకలం
On
DD9 వార్త.. 11.09.2025
మేనఅల్లుడు చేతిలో మేనత్త హత్య – వెంకటాపురం మండలం కలకలం
వెంకటాపురం, సెప్టెంబర్ 11 (DD9 వార్త): ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్‌కే పురం పంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామంలో దారుణ హత్య జరిగింది.
స్థానిక సమాచారం ప్రకారం, కొండ గొర్ల విజయ్ (35), సన్నాఫ్ సమ్మయ్య, తన మేనత్త కొండ గొర్ల ఎల్లక్క (55) ను కత్తితో దాడి చేసి హతమార్చాడు. కుటుంబ తగాదాల కారణంగానే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
హత్య తర్వాత గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మేనఅల్లుడు చేతిలో మేనత్త ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో కలకలం రేపగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
Views: 481
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

