హిందూ సమాజ సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం : సద్గురు మహదేవ్ స్వామీజీ

హిందూ సమాజ సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం : సద్గురు మహదేవ్ స్వామీజీ

సనాతన ధర్మ రక్షణ కోసం హిందూ బంధువులంతా ఏకతాటిపైకి వచ్చి జాగృతం కావాలని గుడిమెట్ మహాదేవ్ ధర్మ పీఠం సద్గురు మహదేవ్ స్వామీజీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల అప్రతిహత ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఆదివారం రాత్రి 'హిందూ సమ్మేళనం' అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా వస్తున్న హిందూ ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రాచీన కాలం నుండి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంతో మంది వీరులు, మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి స్ఫూర్తితోనే నేటి తరం ముందుకు సాగాలని సూచించారు. ప్రతి హిందూ గృహంలో భగవద్గీత గ్రంథం తప్పనిసరిగా ఉండాలని, మన పురాణాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మిబాయి వంటి వీర నాయకుల ఆదర్శాలతో తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం విశేషంగా నిలిచింది. మల్లారం ఆశ్రమ పీఠం స్వామి బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్, ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ కార్యవాహ ముత్యం పాల్గొని హిందూ ధర్మ విశిష్టతను వివరించారు. దేశాభివృద్ధిలో హిందూ సమాజం యొక్క సంఘటిత పాత్ర అత్యంత కీలకమని వారు అభిప్రాయపడ్డారు.

సమ్మేళనంలో ప్రజ్ఞశ్రీ హైస్కూల్, వాగ్దేవి విద్యానికేతన్ మరియు నీలా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. దేశభక్తి, ధర్మ రక్షణ నేపథ్యంలో సాగిన ఈ ప్రదర్శనలు సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో హిందూ జనజాగరణ సమితి అధ్యక్షుడు ముట్టెన్ ప్రకాశ్, నిర్వహణ కార్యదర్శి నీలకంఠ రావు, వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు, ప్రజలు పాల్గొన్నారు. సాలూర వీధులన్నీ హిందూ నామస్మరణతో మారుమోగాయి.

200

Views: 167
Tags:

About The Author

Latest News

ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
సేవా పథంలో లయన్స్ క్లబ్
తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు
బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని