పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

రూ. 30 వేల నగదు, ఫోన్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

నిజామాబాద్‌ జిల్లాలో జూదగాళ్ల ఆటకట్టించేందుకు పోలీసులు కొరడా ఝుళిపించారు. జిల్లా పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య ఉత్తర్వుల మేరకు, సీసీఎస్ ఇన్‌ఛార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఆర్పీక్యాంప్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్ సిబ్బంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

పోలీసుల రాకను గమనించిన జూదగాళ్లు చెల్లాచెదురుగా పరుగులు తీయగా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ. 30,000 నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, నగదును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎడపల్లి ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, ఇలాంటి స్థావరాలపై నిఘా కొనసాగుతుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.


Views: 19
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు