జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరును మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ తీవ్ర నిరసన
బాన్సువాడ, డిసెంబర్ 28(డిడి9 వార్త):
వర్ని మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి జాతిపిత మహాత్మ గాంధీ పేరును మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“దేశ స్వాతంత్ర్యానికి ప్రాణప్రతిష్ఠ చేసిన మహానేత మహాత్మ గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధం. ఇది కోట్లాది భారతీయుల మనోభావాలను గాయపరిచే చర్య” అని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

