తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపు

పోతంగల్ ఫిబ్రవరి 17 (డీడీ9 వార్త): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో మంగళవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత గౌ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పోతంగల్ మండల ఇన్‌చార్జ్ అరిఫ్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు. ఆయన నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక రంగాల్లో పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం ఎంతో శ్రమించిన గొప్ప నాయకుడిగా ఆయనను అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్దలు సాయిలు, వీరయ్య సాయిలు, మండల టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 19
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు