మానవత్వం చాటుకున్న అంకోల్ గ్రామ యువత.. మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

బాన్సువాడ, ఫిబ్రవరి 12(డిడి9 వార్త):

మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల సాయి అకాల మరణం చెందడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన సాయి మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉంది.ఈ ఘటన గ్రామ యువతను కదిలించింది. సాయి కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో యువకులు ఏకమై చందాలు సేకరించారు.తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్పందించి మొత్తం రూ.63,500 సేకరించారు.సేకరించిన ఈ మొత్తాన్ని గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి, కష్టకాలంలో వారికి కొంత భరోసా కల్పించారు.డబ్బు మనిషిని తిరిగి తీసుకురాలేదు, కానీ ఈ కష్ట సమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం మా బాధ్యత అని యువత తెలిపారు.మానవ సేవయే మాధవ సేవ అన్న భావాన్ని ఆచరణలో చూపించిన అంకోల్ గ్రామ యువకులను గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు.

Views: 83
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు