బీర్కూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గువేసిన సర్పంచ్


బీర్కూర్,జనవరి 07(డిడి9 వార్త) :
కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలో నిరుపేదలకు గృహావసరాలను తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శుభారంభం జరిగింది. గ్రామానికి చెందిన అమీనా ఇందిరమ్మ ఇళ్లకు సర్పంచ్ ధర్మ తేజ ముగ్గులు వేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మ తేజ మాట్లాడుతూ నిరుపేదలు, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి తమ సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ రఘు, నవీన్, దుంపల రాజు, శంషుద్దీన్, రఫీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 69
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు