పోలీసుల పేరుతో బెదిరింపులు - ముగ్గురు నిందితుల్లో ఇద్దరు అరెస్ట్ — ఎస్పీ హెచ్చరిక

కామారెడ్డి, నవంబర్ 27(డిడి9 వార్త): దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులని చెప్పి బెదిరించి, ఓ వ్యక్తి వద్ద నుండి నగదు మరియు మొబైల్ ఫోన్ దోచుకున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలో పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.ఈ ఘటనలో రూ.1,800 నగదు, ఒక మొబైల్ ఫోన్ లాక్కున్నట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. నవంబర్ 26న వాహనాల తనిఖీ చేస్తుండగా సరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న తెల్ల రంగు హ్యుందాయ్ క్రెటా కారును పోలీసులు ఆపగా, డ్రైవర్ పారిపోడానికి ప్రయత్నించినప్పటికీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో వ్యక్తిని కూడా అక్కడికక్కడే అరెస్టు చేశారు.విచారణలో నిందితుడు జింక భాస్కర్ తన స్నేహితులు నవీన్ గౌడ్, లక్ష్మణ్‌లతో కలిసి చిన్న మల్లారెడ్డి శివారులో ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక వ్యక్తిని పోలీసులమని నమ్మించి బెదిరించి, బలవంతంగా నగదు మరియు మొబైల్ ఫోన్ దోచుకున్నట్లు తేలింది.పోలీసులు నిందితుల వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్ మరియు హ్యుందాయ్ క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ప్రజలను బెదిరించడం, పోలీసుల పేరుతో అక్రమాలకు పాల్పడటం వంటి చర్యలకు కఠినంగా వ్యవహరించబడుతుందని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద చర్యలు, దోపిడీలు చోటుచేసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు.

Views: 22
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు