బాన్సువాడ జూనియర్ కళాశాలలో ఎన్నికల అధికారులకు శిక్షణ
On
బాన్సువాడ,జనవరి 30(డిడి9 వార్త):
శుక్రవారం బాన్సువాడ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఎన్నికల అధికారులు మరియు సహాయ ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు.ఈ సందర్భంగా 11వ తేదీన జరగనున్న మునిసిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై ఆమె విపులంగా వివరించారు.ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులకు మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు ఉన్నట్లయితే, ఆ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు ఆమె ఆదేశించారు.
Views: 29
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

