కోటగిరి వద్ద రెండు బైకులు ఢీ – ముగ్గురికి తీవ్ర గాయాలు
బాన్సువాడ, డిసెంబర్ 30(డిడి9 వార్త): కోటగిరి మండలంలోని అంగీర్గా ఫారం సమీపంలో శనివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంలో అయాన్ (25), ఆరిఫ్ అనే ఇద్దరు యువకులు గాయపడగా, నాగ శివప్రసాద్ అనే వ్యక్తికి కుడి కాలి తొడ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోతంగల్ 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు అతి త్వరగా ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం బోధన్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.108 అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం,అయాన్‌కు తలకు తీవ్ర గాయం అయినట్లు తెలిపారు.ఈ సహాయక చర్యల్లో పోతంగల్ 108 సిబ్బంది – EMT కె. నారాయణ, పైలట్ పి. అనిల్ మరియుకోటగిరి 108 సిబ్బంది – EMT శ్రీకాంత్, పైలట్ రాజు సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడినట్లు స్థానికులు అభినందించారు.

