యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ అరుదైన శిఖరాలను అధిరోహించాడు

కామారెడ్డి, నవంబర్ 29(డిడి9 వార్త): తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ పర్వతారోహణ రంగంలో మరో మైలురాయిని అధిగమించాడు. ఆయన ఇటీవల మౌంట్ గోరిచెన్, మౌంట్ రియో పూర్గిల్‌తో పాటు అస్సాం, మణిపూర్, మిజోరామ్ రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠిన మార్గదర్శకాల మధ్య ఈ శిఖరాలను అధిరోహించడం విశేషంగా నిలిచింది.యశ్వంత్ ఈ యాత్రలో తీసుకున్న అరుదైన ఫోటోలను ఎస్పీ రాజేష్ చంద్రకి అందజేశాడు. ఈ సందర్భంగా ఎస్పీ యశ్వంత్‌ను అభినందిస్తూ, ఆయన పట్టుదల, ధైర్యసాహసాలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించేందుకు శుభాకాంక్షలు తెలిపారు.

యశ్వంత్ సాధించిన ఈ విజయాలు తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

Views: 15
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు