బీర్కూర్ తండా సర్పంచ్ దేవీసింగ్‌కు ఘనంగా సన్మానించిన యువజన నాయకుడు మియపురం శశికాంత్

బీర్కూర్,జనవరి 07(డిడి9 వార్త):
బీర్కూర్ తండా సర్పంచ్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దేవీసింగ్ను బీర్కూర్ యువజన నాయకుడు మియపురం శశికాంత్ తన స్వగృహంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న సర్పంచ్ సేవలను గుర్తించి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ 
“బీర్కూర్ తండా గ్రామాభివృద్ధికి దేవీసింగ్ అంకితభావంతో పని చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. ఆయన నాయకత్వంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.సర్పంచ్ దేవీసింగ్ మాట్లాడుతూ, ఈ సన్మానం తనకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మియపురం శ్రీకాంత్,శ్యామ్యు,యువజన సంఘ నాయకులు పాల్గొని సర్పంచ్ దేవీసింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Views: 209
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు