మెగా కుటుంబంలో శుభవార్త – తండ్రైన వరుణ్ తేజ్

మెగా కుటుంబంలో శుభవార్త – తండ్రైన వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ జీవితంలో కొత్త ఆనందం చేరింది. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్త వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకుని వరుణ్, లావణ్యను ఆశీర్వదించారు.

ఇప్పటికే మేలోనే వరుణ్ తేజ్, తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. "జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాను" అంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు బాబు పుట్టడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

వరుణ్–లావణ్య ప్రేమకథ అందరికీ తెలిసిన విషయమే. 2017లో వచ్చిన “మిస్టర్” సినిమా ద్వారా వీరిద్దరూ కలిసి పనిచేసి స్నేహితులయ్యారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, చివరికి 2023 నవంబర్ 1న ఇటలీ టస్కానీలో జరిగిన వివాహ వేడుకలో ఒక్కటయ్యారు.

Views: 21

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు