పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం – మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం  – మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్-సన్ సిటి,సెప్టెంబర్20,(డిడి9 వార్త):
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సన్ సిటీలోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన 3కే రన్ ను రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సతీమణి సరోజన గారు కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడటంలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. పిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం మన సమాజానికి, పర్యావరణానికి ఒక పెద్ద హెచ్చరిక అని పేర్కొన్నారు. ప్రజలంతా చెట్లు నాటి, పక్షులకు ఆహారం, నీరు అందించే అలవాటు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు పాఠశాల స్థాయి నుంచే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో గ్లెండేల్ స్కూల్ నిర్వాహకులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

Views: 13

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు