కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్

కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భయానక హత్యకేసు

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త, వెంటనే అక్కడి నుంచి పరారైన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం – యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని అడ్డగూడూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ (40), మంజుల (35) దంపతులు కుటుంబ సమస్యలతో తరచూ గొడవపడేవారని సమాచారం. వీరికి ముగ్గురు సంతానం – ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నాలుగు రోజుల క్రితం శంకర్ కుటుంబంతో కలిసి మహేశ్‌నగర్ కాలనీలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అక్కడే నివాసం ఉంటూ వచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా, శంకర్ భార్య మంజులపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా మంజుల అక్కడికక్కడే మృతిచెందింది.

ఆమె కేకలు వినిపించగానే కుటుంబ సభ్యులు మెలుకువ వచ్చారు. అప్పటికే శంకర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే కుషాయిగూడ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హంతకుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Views: 16

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు