హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం

హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి వీరశైవ లింగాయత్ సంఘం తన ఉదారతను చాటుకుంది. శనివారం ఆ సంఘానికి చెందిన రైతులందరూ కలిసి తమ పంట సాగు విస్తీర్ణం ఆధారంగా (ఎకరా చొప్పున) విరాళాలు సేకరించి, మొత్తం రూ. 3,02,850ల  నగదును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మందిర కమిటీ సభ్యులు వీరశైవ లింగాయత్ సంఘం రైతులకు మరియు పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తి భావంతో రైతులందరూ ఏకమై ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాంతీశ్వర్ పటేల్, గాండ్ల విఠల్, నితిన్ పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Views: 5
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు