రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌కు సీపీ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్‌కు సీపీ  పరామర్శ

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఎన్.గంగా ప్రసాద్‌ను నిజామాబాదు పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. జిల్లా పాస్‌పోర్ట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ 1921 (గంగా ప్రసాద్) ఈ నెల 15న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీపీ ఆసుపత్రికి చేరుకొని కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్‌కు అందుతున్న చికిత్స గురించి అక్కడ ఉన్న వైద్య బృందంతో సిపి చర్చించారు. బాధితుడికి ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పోలీస్ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ మణిదీప్ రెడ్డి, డాక్టర్ వను, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Views: 6
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు